స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 169లో.. మురారి తన డైరీని తీసుకొని బయటకు వెళ్దామనుకుంటే ఇంట్లో వాళ్ళంతా వస్తానంటారు. దాంతో డీజీపి సర్ తనకు కాల్ చేసాడని.. బయటకు వెళ్ళట్లేదని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు మురారి.
మురారి అలా బయటకు లోపలికి కంగారుగా వెళ్ళడం కృష్ణ గమనిస్తుంది. ఎన్నడు లేనిది ఏసీపి సర్ ఎందుకింత టెన్షన్ పడుతున్నాడని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. అయితే మురారి కంగారుగా తన గదిలోకి వెళ్ళి రూం డోర్ వేసి డైరీని అలమరాలో ఉన్న తన బట్టల కింద దాచేస్తాడు. అయితే కాసేపటికి కృష్ణ పాలు తీసుకొని రూంలోకి వచ్చేసరికి మురారి పడుకొని ఉన్నట్టు నటిస్తాడు. అలా మురారి పడుకోవడం చూసి డిస్టర్బ్ చేయడమెందుని భావించిన కృష్ణ.. అలమరాలో ఉన్న బట్టలని చక్కగా సర్దుదామని అనుకుంటుంది. అలా మురారి అన్ని బట్టలని తీసి బెడ్ పై వేస్తుంది. అందులోనే మురారి డైరీ కూడా ఉంటుంది. అది గమనించి వెంటనే ఉలిక్కిపడి లేస్తాడు మురారి. ఏం అయిందని కృష్ణ అడుగగా.. కలలో గన్ ఫైరింగ్ అయింది అందుకే లేచానని చెప్తాడు. ఆ తర్వాత తన బట్టలు తానే సర్దుకుంటానని.. కృష్ణని స్నానానికి వెళ్ళమని మురారి చెప్తాడు. అయితే కృష్ణ అలా లోపలికి వెళ్ళగానే డైరీని బెడ్ కింద దాచేస్తాడు మురారి. ఆ తర్వాత మురారి స్నానానికి వెళ్తాడు.
కృష్ణ బెడ్ షీట్ వేసి బెడ్ మీద చక్కగా సర్దుతుండగా.. అనుకోకుండా మురారి డైరీ చేతికి తగులుతుంది. అది చూసిన కృష్ణ షాక్ అవుతుంది. ఏసీపీ సర్ డైరీ కూడా రాస్తాడా అని అనుకొని లోపల పేజీలు ఓపెన్ చేసి చూస్తుంది. అందులో మురారి ప్రేమించిన అమ్మాయి గురించి కవిత్వం రాస్తాడు. అది చూసి కృష్ణ మనసు విరిగిపోతుంది. నా ప్రేమ శున్యమైంది.. మురారి మనసులో వేరే అమ్మాయి ఉంది అని తనలో తాను కుములిపోతుంది. అయితే మురారి వాష్ రూంలో నుండి వస్తుండటం గమనించి వెంటనే మురారి డైరీని మళ్ళీ బెడ్ కింద దాచేస్తుంది. ఆ తర్వాత మురారి టవల్ ని బెడ్ పై విసిరేయగా అది కృష్ణ ముందు అడ్డుగా పడుతుంది. అప్పుడు మురారి అక్కడకి వచ్చి టవల్ ని తీయాలని చూస్తే కృష్ణ కూడా తీయాలనుకుంటుంది. అలా ఇద్దరు ఒకేదగ్గర ఆగిపోతారు. నీకు నాకు మధ్య ఈ టవల్ అడ్డుగోడలా ఉంది ఏసీపీ సర్ అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.